HI FRIENDS WELCOME TO ANDHRA NEWS AND VIEWS

26 డిసెం, 2010

నివేదికలో ఏమీ ఉండదని దుగ్గలే నాకు చెప్పారు: కేసీఆర్


ప్రత్త్యేక తెలంగాణా వస్తుందా ? అంటూ నమస్తే గురు చెప్పి 24 గంటలు గడవకముందే జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించే నివేదిక తెలంగాణకు అనుకూలంగా ఉండదనే విసయాన్ని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు.

జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించే నివేదికలో తెలంగాణకు అనుకూలంగా ఏమీ ఉండదనే విషయాన్ని ఆ కమిటీ సభ్యకార్యదర్శి వీకేదుగ్గలే స్వయంగా తనకు చెప్పారని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఆయన ఆదివారం తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. శ్రీకృష్ణ కమిటీ వల్ల ఒరిగేది ఏమీ ఉండదన్నారు. ఈ విషయాన్ని దుగ్గల్ స్వయంగా తనకు చెప్పారన్నారు. కమిటీ నివేదికలో సమైక్యాంధ్రగా ఉంచాలని మాత్రమే ఇవ్వనున్నట్టు చెప్పారని కేసీఆర్ వెల్లడించారు.

2జీ స్కామ్ ఏది నిజం ?


2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో మాజీ కేంద్రమంత్రి రాజా అవినీతి హిమాలయాలను మించిపోయింది - ఎఐడీఎంకే అధినేత్రి జయలలిత

2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కుంభకోణo
జరగటం వాళ్ళ ప్రభుత్వానికి 1.46 లక్షల కోట్లు నష్టం - కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)

2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కుంభకోణానికి పూర్తిగా కాంగ్రెస్‌ పార్టీదే బాధ్యత
- సిపిఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకరత్

2జి స్పెక్ట్రమ్‌ వ్యవహారంలో మంత్రినీ, దోషులైన అధికారులనే కాక లంచాలిచ్చిన కార్పొరేట్‌ సంస్థల యజమానులను కూడా శిక్షించాలి - ప్రకాశ్కరత్
2జి కుంభకోణంలో నాకు ఏ ప్రమేయమూ లేదు - ప్రధాని మన్మోహన్సింగ్

పార్టీ నేతలు అవినీతికి, పేరాశకు దూరంగా ఉండాలి. అవినీతి జాడ్యాన్ని వీడకపోతే… పేదల కోసం పనిచేస్తున్నామంటూ మనం చెప్పడం అసహజంగా ఉంటుంది - సోనియా గాంధీ

2జి స్పెక్ట్రమ్, కామన్వెల్త్ క్రీడలు, ఆదర్శ్ హౌసింగ్
కుంభకోణాల నేపథ్యంలో అవినీతిపై పోరాడాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది - అవినీతిని అంగీరించిన కాంగ్రెస్

కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియాతో
నాకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు - భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ.

రాజా ద్వారా లబ్ధి పొందలేదు, బిజెపి హయాంలోనే అక్రమాలు - టాటా


ఏంటి
గురు ఇంకా అర్థం కాలేదా ఏ స్కాం జరిగిన ఏమ్మునది మనకోచ్చేది. అసలు ఆ మొత్తం 1.46 లక్షల కోట్లు ఎక్కడున్నాయో?



25 డిసెం, 2010

ప్రత్త్యేక తెలంగాణా వస్తుందా?




2009 డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటన రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చివేసింది. అప్పట్లో తెలంగాణా విద్యార్తులు చేసిన ఉద్యమాలు దానికి బదులుగా సీమాంద్ర విద్యార్తులు ఉద్యమాలు చేయడం తో కాంగ్రెస్ ప్రబుత్వం శ్రీ కృష్ణ కమిట్టీ ని నియమించి ఆంధ్రుల మనోబావాలను తెలుసుకోవలసిందిగా కోరింది. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల అబిప్రాయాలు సేకరించింది. ఐతే ప్రత్యెక రాష్ట్రముఫై ఇప్పటికి ఎటువంటి నిర్ణయం శ్రీకృష్ణ కమిటీ ప్రకటించే అవకాసం లేదు అని తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ కేవలం సూచనలకే పరిమితం కానున్నదని తెలుస్తుంది. డిసెంబర్ 31 తరువాత రాష్ట్రంలో మరింత ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడ్డనున్నాయి. శ్రీకృష్ణ కమిటీ చేయబోయే సూచనలు ఎలావుంటాయో అన్న ఆసక్తి అందరిలోనూ ఉత్సుకత రేకెత్తిస్తోంది. ఐతే ఇప్పటికి జరిగిన జరుగుతున్నా పరిణామాలను బట్టి కమిటీ ఈవిడంయ్న సూచనలను చేస్తుందని ప్రజలలో చర్చ జరుగుతోంది అవి
  • రాష్ట్రాన్ని బాగాలు చేయడం
  • హైదరాబాద్ ను దేశానికీ రెండో రాజధాని చేయడం (అయతే హైదరాబాద్ లేని తెలంగాణ ఊహించలేనిది)
  • ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిని చేయడం
  • హైదరాబాద్ ను కేంద్ర పాలిట ప్రాంతంగా ప్రకటించే అవకాసం కూడా ఉంది.
  • ఐతే నిర్ణ మైన ముందుగా ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఆమోదం పొందాలన్న నియమం విదిస్తారని తెలుస్తోంది.

అబివృద్దికి నోచుకోని ఆంధ్రప్రదేశ్?


వై స్స్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రాష్ట్రము పూర్తిగా సంక్షోబాని ఎదుర్కొంటోంది. ఒక వైపు ప్రత్యెక తెలంగాణా ఉద్యమం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాజకీయ సంక్షోబం మరియు తుఫానులూ రాష్ట్రాన్ని సుడిగుండం మార్చివేశాయి. ఇప్పటికే ఉద్యమాలు రాష్ట్ర ప్రజలను కలవరపెడుతుంటే మరోవైపు శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎలాఉండబోతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఐతే ఇవేవి పట్టని రాష్ట్ర రాజకీయ నాయకులూ పార్టీలో చేరితే తమ భవిస్యత్తు ఎలావుంటుందో అని మంతనలతో మునిగితేలుతున్నారు. వైపు రైతుల మరోవైపు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికిన ప్రభుత్వం కళ్ళు తెరిచి రాష్ట్రప్రజల అవసరాలపి ద్ద్రుష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.

రాణీముఖర్జీ విద్యాబాలన్ లెస్బియన్ కిస్

బాలీవుడ్ అందాల తారలు రాణీముఖర్జీ విద్యాబాలన్ మద్య ముద్దు దృశ్యాలు సంచలనం రేపుతునాయి. నో ఒనె కిల్లెద్ జెస్సికా సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ అందాల బామలు జూమ్ టీవీ షో లో లిప్ కిస్ ని ఎంజాయ్ చేసారు. ఇంటర్నెట్ లో వీరి ముద్దు దృశ్యాలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే పాశ్చాత్య సంస్కృతీ బారత దేశాన్ని కబలిస్తోందని బాధపడేవారికి ముద్దు దృశ్యాలు మరింత బాధను మిగిలించక మానవు.

ఆ వేషం మూత్రవిసర్జనకూ అడ్డంకిగా మారింది: వెంకీ


మనిషికి భయమనేది ఈ బాడీని గురించే.. ఇది ఏమయిపోతుందోనని దాన్ని మనసులో ఎక్కించుకుంటే నిజంగా భయపడిపోతాడు. మైండ్‌ను చాలా కూల్‌గా ఉంచుకోవాలి. ఈ బాడీకి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇదంతా ఓ డ్రామాగా తీసుకోవాలి... అంటూ విక్టరీ వెంకటేష్‌ సూక్తులు వల్లించారు. 'నాగవల్లి' చిత్రం చేశాక... వెంకటేష్‌కు ఏదో అవుతుందనే నెగెటివ్‌టాక్‌ ఇండస్ట్రీలో వచ్చింది. కన్నడలో ఆప్తరక్షక చేశాక విష్ణువర్ధన్‌ కాలధర్మం చెందారు. దాంతో ఈ చిత్రాన్ని రజనీ చేసేందుకు వెనుకంజ వేసినట్టు ప్రచారం జరిగింది.

అటువంటి చిత్రాన్ని వెంకటేష్‌ టేకప్‌ చేశాడంటే ఇండస్ట్రీలో గుసగులసు మొదలయ్యాయి. ఇవన్నీ తనదాకా వచ్చాయని విక్టరీ వెంకటేష్‌ తన మనసులోని మాటను శనివారం ఆవిష్కరించారు. సినిమా విడుదలయ్యాక మహారాష్ట్ర వెళ్ళి వచ్చారు. అక్కడ ఆత్యాధ్మికలోకంలో గడిపాననీ, మళ్ళీ త్వరలో వెళ్ళనున్నానని చెప్పారు. రజనీకాంత్‌ కూడా అలా వెళతారు. మీకు కలుస్తారా? అని అడిగితే... మేం కాంటాక్ట్‌లో ఉంటామని బదులిచ్చారు.

రజనీకాంత్‌గారు ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకున్నారంటూ... ఏదైనా జీవితంలో కొత్త ప్రయోగం చేయాలి. లేదంటే మనకు గుర్తింపు ఉండదని వెంకీ సెలవిచ్చారు. రాజు గెటప్‌కు 4 గంటలు మేకప్‌ వేసుకున్నాను. ఆ కాస్ట్యూమ్స్‌ వేసుకొన్నాక ప్రకృతి కార్యాలను అణచుకొన్నాను. యూరిన్‌కు కూడా వెళ్ళడానికి వీలులేని విధంగా కష్టపడాల్సివచ్చిందని అన్నారు.

ఆంధ్రా వార్తలకు స్వాగతం

హాయ్ ఫ్రెండ్స్ ఆంద్ర వార్తలకు స్వాగతం, రాష్ట్రంలో జరిగే వింతలూ, విశేషాలు, క్రీడలు మరెన్నో విసయలకు మన బ్లాగ్ వేదిక కాబోతోంది. మీ విలువిన సలహాలు సూచనలను దయచేసి కామెంట్ చేయండి.