HI FRIENDS WELCOME TO ANDHRA NEWS AND VIEWS

4 జూన్, 2012

రణరంగంగా మారిన రాయచోటి

కడప జిల్లాలోని రాయచోటిలో ఉప ఎన్నిక ల ప్రచారం ఉద్రిక్తతకు దారితీసింది. పాత రాయచోటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి ఇంటింటా ప్రచారాన్ని టీడీపీ కార్యకర్తలు సోమవారం అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాళ్లతో దాడికి పాల్పడడంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇటు శ్రీకాంత్ రెడ్డిపై దాడికి యత్నించగా ఆయన గన్ మెన్ గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఇంతలో అదనపు బలగాలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది. టీడీపీ దాడుల్లో పదిహేను మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాయపడగా ఒక టీడీపీ కార్యకర్త గాయపడ్డాడు. ఇటు పట్టణ శివార్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడికి సంబందించిన ఒక జీపును కూడా ధ్వంసం చేశారు. పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అక్కడ జరిగిన గర్షణకు సంబందించిన వీడియో అలాగే ఏప్రిల్ 30 న అన్ని పార్టీల అభ్యర్తులతో టీవీ 9 చేసిన ఇంటర్వ్యూ వీక్షకులకోసం ఇవ్వబడింది జరిగింది.

రాయచోటి అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్తులు
1 శ్రీకాంత్ రెడ్డి (YSRCP)


 








2 . రాంప్రసాద్  రెడ్డి (Congress)

 







3. సుబ్రహ్మణ్యం (TDP)










FIGHT BETWEEN YSRCP AND TDP

 

WHO WILL WIN IN RAYACHOTI TV 9

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి